గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం పెరగటంతో అధికారులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. నగరంలోనే 10 రెడ్ జోన్లు ప్రకటించారు. వీటిలో పాతగుంటూరు పరిధిలో 7, కొత్తగుంటూరు పరిధిలో మూడు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. దీంతో నగరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు చూస్తున్నారు. నగరంలోని రెండు ప్రధాన పైవంతెనలపై ట్రాఫిక్ నియంత్రించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఆ మార్గంలో వెళ్లేందుకు వీలు లేకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, చేబ్రోలు, కారంపూడి, దాచేపల్లి, మేడికొండూరు ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు.
గుంటూరు నగరంలోనే 10 రెడ్ జోన్లు - గుంటూరులో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలవుతోంది. నగరంలోనే 10 రెడ్ జోన్లను అధికారులు ప్రకటించారు. రోడ్లపైకి ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అత్యవసరమైతేనే అనుమతిస్తున్నారు.
guntur-lock-down