ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో పోలింగ్​ సరళిని పరిశీలించిన జేసీ దినేష్ కుమార్ - గుంటూరు జేసీ దినేష్ కుమార్ వార్తలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

guntur joint collector examines polling process at sattenapalli
సత్తెనపల్లిలో ఎన్నికల సరళిని పరిశీలించిన జేసీ దినేష్ కుమార్

By

Published : Mar 10, 2021, 10:40 AM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి తమ ఓటుహక్కును వినియోగించునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పట్టణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను.. జిల్లా సంయుక్త పాలనాధికారి దినేష్ కుమార్ పరిశీలించారు. 7, 8, 21 వార్డులను పరిశీలించి.. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details