ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పరీక్షలు నిర్వహించకపోవటం పట్ల జేసీ ఆగ్రహం - గుంటూరు జేసీ ఆగ్రహం

గుంటూరు జిల్లా కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవటం పట్ల జేసీ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె...పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

కరోనా పరీక్షలు నిర్వహించకపోవటం పట్ల జేసీ ఆగ్రహం
కరోనా పరీక్షలు నిర్వహించకపోవటం పట్ల జేసీ ఆగ్రహం

By

Published : Sep 25, 2020, 10:13 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జేసీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. "ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయాలని చెప్పాము కదా...ఎందుకు చేయటం లేదు. మీ డాక్టర్ ఎక్కడ ఉన్నారు...ఎందుకు పరీక్షలు చేయటం లేదు" అని సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆసుపత్రి వైద్యాధికారి గురించి జిల్లా వైద్యాధికారి యాస్మిన్​కు ఫోన్​ చేసి వివరాలు అడిగారు. ఆసుపత్రి వైద్యాధికారి సెలవులో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె...ఇక నుంచి పరీక్షలు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించి ఉద్యోగులతో మాట్లాడారు. వారానికి కనీసం 250 అర్జీల సమస్యలు పరిష్కారించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details