గ్రామ సచివాలయాల్లో ప్రజల సమస్యలపై ఇచ్చిన అర్జీల నమోదులో పురోగతి లేకపోవటంతో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్-2 పి.ప్రశాంతి ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసింది. జిల్లాపరిషత్తు అధికారులు, ఉద్యోగులు ఫోన్లు చేసి చెప్పినా ఎంపీడీవోల్లో మార్పులేదని తెలిసింది. దీనిపై జేసీ-2 ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు సుపరిపాలన అందజేసేందుకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసినందున బాధ్యతతో పనిచేయాలని ఎంపీడీవోలకు జేసీ స్పష్టం చేశారు.
ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు జేసీ తాకీదులు - ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు తాకీదులు !
ప్రజల సమస్యలపై ఇచ్చిన అర్జీల నమోదులో పురోగతి లేకపోవటంతో గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్-2 పి.ప్రశాంతి ఎంపీడీవోలకు తాకీదులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని 18 మండలాల ఎంపీడీవోలను ఆదేశించారు.
![ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు జేసీ తాకీదులు ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు జేసీ తాకీదులు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7483271-553-7483271-1591337345097.jpg)
ప్రజాసమస్యలపై అలసత్వం...ఎంపీడీవోలకు జేసీ తాకీదులు !
తాకీదులు అందుకున్న ఎంపీడీవోలు
- అమృతలూరు
- భట్టిప్రోలు
- బొల్లాపల్లి
- చేబ్రోలు
- చెరుకుపల్లి
- దుగ్గిరాల
- కర్లపాలెం
- కొల్లిపర
- కొల్లూరు
- ముప్పాళ్ల
- నిజాంపట్నం
- పి.వి.పాలెం
- పొన్నూరు
- రాజుపాలెం
- చుండూరు
- వెల్దుర్తి
- వినుకొండ
- కాకుమాను