అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాజకీయేతర ఐకాస నేతలు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజలు వద్ద నుంచి సంతకాల సేకరణ నిర్వహించి.. ఆ పత్రాలను ప్రధాని మోదీ, రాష్టపతి, గవర్నర్లకు పోస్ట్ చేశారు. గుంటూరు చంద్రమౌళి నగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి జేఏసీ నేతలు లేఖలను పోస్ట్ చేశారు. అమరావతిని ఏకైక పరిపాలన రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అమరావతి రైతుల సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లేందుకు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు వారు తెలిపారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు గత 48 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అమరావతినే రాజధానిగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
పోస్టు కార్డు ఉద్యమం: ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్‌కు ఐకాస లేఖలు - ప్రధానికి గుంటూరు జేఏసీ నేతలు లేఖలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ నాన్ పొలిటికల్ ఐకాస నేతలు ప్రధాని, రాష్ట్రపతులకు లేఖలు పోస్ట్ చేశారు. 48 రోజులుగా అమరావతి కోసం పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు విమర్శించారు.
![పోస్టు కార్డు ఉద్యమం: ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్‌కు ఐకాస లేఖలు guntur jac sends post to modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5948665-599-5948665-1580793109277.jpg)
అమరావతి కోసం గుంటూరులో పోస్టుకార్డుల ఉద్యమం
అమరావతి కోసం గుంటూరులో పోస్టుకార్డుల ఉద్యమం