ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్లాక్ ఫంగస్ కట్టిడికి జీజీహెచ్​ సిద్ధం.. ప్రత్యేక వార్డులో చికిత్స - గుంటూరు సర్వజనాసుపత్రిలో ప్రత్యేక చికిత్స

బ్లాక్ ఫంగస్ ముప్పును తప్పించే నేపథ్యంలో గుంటూరు సర్వజన ఆస్పత్రిలో వైద్య అధికారులు ప్రత్యేక వైద్య వసతులు సమకూర్చుతున్నారు. అనుమానిత లక్షణాలతో వచ్చే వారిని ఈ మేరకు ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు.

బ్లాక్ ఫంగస్ కట్టిడికి జీజీహెచ్​ సిద్ధం.. ప్రత్యేక వార్డులో చికిత్స
బ్లాక్ ఫంగస్ కట్టిడికి జీజీహెచ్​ సిద్ధం.. ప్రత్యేక వార్డులో చికిత్స

By

Published : May 22, 2021, 6:07 PM IST

మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) వ్యాధి లక్షణాలతో గుంటూరు సర్వజనాసుపత్రికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బాధితుల కోసం శుక్రవారం ప్రత్యేక వార్డును కేటాయించారు. ప్రస్తుతం 27 మంది చికిత్స పొందుతున్నారు.

వేగంగా సమకూర్చుకోవాలి..

తొలి దశలో ముప్పును గుర్తించకపోతే ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అనుమానిత లక్షణాలతో వచ్చేవారిని ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. శస్త్ర చికిత్స గదిని సిద్ధం చేయడం, అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడం, ఔషధాలను, మానవ వనరులు సహా అవసరమైన వసతులను సమకూర్చుకోవడం వంటి పనులను వేగంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇవీ చూడండి :దిల్లీ నుంచి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో వైద్యపరికరాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details