ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​పై ఇద్దరు.. ఆపుతున్న పోలీసులు

అవసరమున్నా లేకపోయినా ఇద్దరు చొప్పున బైక్​పై వెళుతున్న వారిని గుంటూరులో పోలీసులు ఆపుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలు పాటించనివారిపై కొరడా ఝుళిపిస్తున్నారు.

guntur free from lockdown
గుంటూరులో లాక్ డౌన్ సడలింపులు

By

Published : Jun 5, 2020, 12:50 PM IST

లాక్ డౌన్ సడలింపులతో రోడ్డుమీదకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓవైపు వైరస్ విజృంభిస్తూనే ఉంది. బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... ప్రభుత్వ నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు సూచిస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది వాహన చోదకులు వాటిని పట్టించుకోవడంలేదు.

అవసరమున్నా లేకపోయినా ద్విచక్రవాహనాలపై ఇద్దరు చొప్పున ప్రయాణిస్తున్నారు. సరైన కారణం లేకుండా అలా వెళ్తున్న వారిని గుంటూరులో పోలీసులు ఆపుతున్నారు. అరగంటసేపు వారిని వేచి ఉంచి తర్వాత తాళాలు ఇస్తున్నారు. దీంతో కార్యాలయాలకు ఆలస్యమవుతోందని చోదకులు అంటున్నారు. అయితే నిబంధనలు పాటించకపోతే కరోనా వ్యాప్తి అధికమవుతోందని.. నియంత్రణ చర్యల్లో భాగంగానే తాము ఇలా చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.

ఇవీ చదవండి....పల్లెల్లో పడగ.. భారీగా పెరుగుతున్న కట్టడి ప్రాంతాలు!

ABOUT THE AUTHOR

...view details