ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

New Variety Fish Culture: ఆక్వా సాగుతో అదరగొడుతున్న గుంటూరు రైతులు

Guntur Faremers Talent: సముద్రంలో ఎన్నో రకాల అరుదైన చేపలుంటాయి. కాకపోతే అవి అంత త్వరగా వలకు చిక్కవు. చిక్కినా వినియోగదారులకు చవకగా దొరకవు. సముద్రంలో పెరిగే 2 రకాల చేపల్ని చెరువుల్లో పెంచుతూ లాభాలు పంట పండించుకుంటున్నారు ఆ రైతులు.

guntur-farmers-raising-rare-fishes
ఆక్వాసాగుతో అదరగొడుతున్న గుంటూరు రైతులు

By

Published : Dec 28, 2021, 2:26 PM IST

New Fish Culture: పండుగప్ప.. ఆంగ్లంలో సీబాస్‌..! చందువా పార.. ఇంగ్లీష్‌లో సిల్వర్‌ పాంపనో..! సహజంగా ఈ రెండు చేపలూ సముద్రంలో పెరుగుతాయి. మార్కెట్లోనూ వీటికి మంచి డిమాండ్‌ ఉంటుంది. కాకపోతే సముద్రంలో వీటి లభ్యత తగ్గింది. దీన్నే వ్యాపార అనుకూలంగా మార్చుకున్నారు గుంటూరు జిల్లా పెదపులుగువారిపాలేనికి చెందిన కొందరు రైతులు. 33 ఎకరాల్లో పండుగప్ప, చందువాపార రకం చేపలను పెంచుతున్నారు. ఈ రకం చేప పిల్లల లభ్యత.. దాణా అందుబాటులోకి రావడం, సాంకేతిక పరిజ్ఞానం తోడవడంతో సాగు ఊపందుకుంది. డిమాండూ రెట్టింపైంది.

పండుగప్ప, చందువా పార.. వాటికన్నా చిన్న చేపల్ని ఆహారంగా తినేస్తాయి. దీనికితోడు పెరుగుదల పరిమాణంలో అసమానతలూ ఎక్కువే. అందువల్ల చెరువుల్లో పెంచితే పిల్ల చేపల్ని తోటి చేపలే తినేయకుండా అన్నింటినీ వలతో ఏర్పాటు చేసిన నిర్మాణంలో పెంచుతారు. వారానికోసారి గ్రేడింగ్‌ చేసి 100 గ్రాముల బరువు వచ్చే వరకు వేర్వేరు పంజరాల్లో ఉంచుతారు. తర్వాత అన్నీ ఒకే పరిమాణంలో ఉన్న చేపల్ని చెరువుల్లోకి విడుదల చేస్తారు. చందువాపారను ఆర్నెళ్లు, పండుగప్పను 11 నెలలు పెంచాక విక్రయిస్తారు.

ఆక్వాసాగుతో అదరగొడుతున్న గుంటూరు రైతులు

మేము ఏర్పాటు చేసిన కల్చర్ వల్ల సర్వైవల్ కూడా వచ్చి కచ్చితంగా 50 వేలకే ఒక 90 శాతం మాకు కనపడుతూ ఉంది. కారబాలిజం లేకుండా వారం వారం వీటిని గ్రేడింగ్ చేసేసి ఒక దాంట్లోంచి వేరో దాంట్లోకి మార్చడం వల్ల సర్వైవల్ కాని కారబాలిజం లేకోకుండా ఉంటుంది. అందుకనే రాబోయే కాలంలో రైతాంగానికి ఇదెంతో అంటే పంటమార్పిడి.. మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు కూడా పంటమార్పిడి అనేది చదువుకున్నాం. రెండు కల్చర్​లు అంటే అటు రొయ్య గాని ఇటు చేపలు గాని పెంచొచ్చు. - శ్రీనివాస రెడ్డి, రైతు

పండుగప్ప చేపకు మనదేశంతో సహా సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంకల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఉప్పు చేపగా తయారుచేసి.. కిలో 800 రూపాయలకుపైగా విక్రయిస్తారు. రైతుకు పొలం దగ్గర పట్టిన వెంటనే కిలోకు 400 లభిస్తోంది. డిమాండ్‌ పెరగడానికి ప్రోటిన్‌ ఎక్కువగా ఉండటం సహా రుచీ కారణమే..! చందువా పార రకం కూడా కిలో రూ.300పైగా ధర ఉంది.

సముద్రం అంటే పెద్దది కదా అక్కడ సాగు చేయడం మనకు కష్టం. మనకు కొంచెం స్థలమున్నా అందులో చేపల సాగు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా గ్రోత్ అన్ని బాగానే ఉంది. కలర్, వేరియేషన్, ఫీడింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. - కిషోర్, పెదపులుగువారిపాలేం

వనామీ, టైగర్‌ రొయ్యలను ఉప్పునీటిలో సాగుచేసేవారు. ప్రత్యామ్నాయంగా.. ఈ తరహా చేపలసాగు చేపట్టవచ్చని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

Farmer Problems: సరైన ధర లేక.. పశువులకు మేతగా కొత్తిమీర!

ABOUT THE AUTHOR

...view details