ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రహదారి దిగ్బంధం, పిన్నెల్లిపై దాడి కేసుల్లో... 9మంది రైతులు అరెస్టు - అమరావతి రైతులు అరెస్టు వార్తలు

ఈ నెల 7న చినకాకాని జాతీయ రహదారి దిగ్బంధం ఘటనకు సంబంధించి ఏడుగురు రైతులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు... రైతులకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై దాడి కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.

guntur farmers arrested by mangalagiri police
రహదారి దిగ్బంధం, పిన్నెల్లిపై దాడి కేసులో... 9మంది రైతులు అరెస్టు

By

Published : Jan 9, 2020, 11:53 PM IST

రహదారి దిగ్బంధం, పిన్నెల్లిపై దాడి కేసులో... 9మంది రైతులు అరెస్టు

ఈ నెల 7వ తేదీన చినకాకాని జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొన్న ఏడుగురు రైతులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం, నిడమర్రుకు చెందిన ఫణీంద్రరెడ్డి, బత్తుల హరిదాసు, పలగాని తాతారావు, దోనే వీరాంజనేయులు, గుంటూరుకు చెందిన నయాబ్ రసూల్, రియాజ్, వెంకట సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు.. రైతులకు 14 రోజులు రిమాండ్ విధించింది. మాచెర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి.. కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details