గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లిలోని పంట పొలంలోని విద్యుత్ తీగలు రైతన్నను బలి తీసుకున్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వర్లు(53) పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు పొలంలో విద్యుత్ తీగలు తగిలి వెంకటేశ్వర్లు అక్కడిక్కడే మృతి చెందారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు పొలంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. ఇటీవల వర్షాలకు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. దీంతో తీగలు నేలకొరిగి ఈ ప్రమాదం జరిగింది.

విద్యుదాఘాతంతో రైతు మృతి
ఇటీవల వర్షాలతో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి తీగలు నేలకొరిగాయని, అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడంలేదని గ్రామస్థులు అంటున్నారు.
ఇదీ చదవండి :రాజధాని ఏర్పాటు మా పరిధిలోనిది కాదు: కేంద్రం