మూడు రాజధానులు వద్దు... ఒకే రాజధాని ముద్దు అని ఎమ్మెల్యే ముస్తఫాకు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు వినతి పత్రం అందించారు. రాజధాని కోసం రైతులు పెద్దఎత్తున భూములు ఇచ్చారని... ఇప్పుడు వేరే చోటుకు మారిస్తే ఎలా అని రైతులు ప్రశ్నించారు. దీనివల్ల నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ దృష్టికి ప్రజల విన్నపాన్ని తీసుకెళ్లి... మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రైతుల వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే ముస్తఫా హామీ ఇచ్చారు.
'మూడు రాజధానులు వద్దు... ఒకటే ముద్దు' - రాజధాని రైతుల తాజా వార్తలు
మూడు రాజధానులు వద్దు... అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాకు రాజధాని పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు వినతి పత్రం అందించారు.
!['మూడు రాజధానులు వద్దు... ఒకటే ముద్దు' Guntur East MLA Mustafa was presented with a memorandum by leaders of the Capital Conservation Council (JAC).](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5497450-629-5497450-1577347189477.jpg)
ఎమ్మెల్యే ముస్తఫాకు రాజధాని పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేత