ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఇసుక: సరకు తక్కువ రాళ్లు ఎక్కువ! - గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఇసుక

ఇసుక పాలసీలో సమూల మార్పులు చేశాం.. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటే రెండురోజుల్లో ఇంటివద్దకే ఇసుకను సరఫరా చేస్తామని అధికారులు అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇవేవి కనిపించటం లేదంటున్నారు గుంటూరు జిల్లా ప్రజలు.

guntur dst vengalapalem people comments on govt sand  contains too much stones
guntur dst vengalapalem people comments on govt sand contains too much stones

By

Published : Jul 19, 2020, 7:23 AM IST

ఆన్​లైన్​లో ఇసుక బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి షాక్ తగిలింది. బుక్ చేసిన పది రోజులకు ఇసుక రాగా... అందులో సగానికి పైగా రాళ్లే ఉన్నాయి.

గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన అల్లాభక్షు గత నెలలో ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. ఎట్టకేలకు నెలా పదిరోజులకు ఇసుక ఇంటికి వచ్చింది. రాత్రి సమయం కావటంతో అన్‌లోడ్‌ చేయించుకున్నారు. ఉదయం చూస్తే ఇసుకలో సగానికిపైగా రాళ్లే కనిపించాయి. దీనిని చూసి వినియోగదారు లబోదిబోమంటున్నారు. ఎంతో ఖర్చుపెట్టుకుని ఇసుకను తెప్పించుకుంటే ఇలా రాళ్లు ఎక్కువగా ఉండటం ఏమిటని వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details