గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ నమోదైన ప్రాంతంలో జిల్లా అర్బన్ ఎస్పీ రామకృష్ణ పర్యటించారు. అర్బన్ పరిధిలో ఇప్పటి వరకు 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఇందులో ఒకటి మంగళగిరిలో ఉందని తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన 63 మందిని పరీక్షలకు పంపించామన్నారు. వాళ్లు నివాసం ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. అర్బన్ పరిధిలో లాక్డౌన్ సక్రమంగా అమలవుతోందని చెప్పారు.
'స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వండి.. చికిత్స అందిస్తాం' - #corona list inAP
నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ముస్లింలు స్వచ్ఛందంగా జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గుంటూరు అర్బన్‌లో 10 కేసులు నమోదు కాగా వారి కుటుంబీకులను క్వారంటైన్లో పెట్టామని తెలిపారు.
అనుమానం ఉంటే సమాచారం ఇవ్వమంటున్న జిల్లా ఎస్పీ