ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 7, 2020, 8:18 PM IST

ETV Bharat / state

మాస్కు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా

మాస్కు లేకుండా బయటకు వచ్చిన వారి నుంచి గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ 1000 రూపాయల జరిమానా వసూలు చేశారు. మాస్కు లేకుండా తిరిగితే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

guntur dst police fine thousand rupees form who came out without mask
guntur dst police fine thousand rupees form who came out without mask

కరోనా వైరస్​ను కట్టడి చేయడంలో భాగంగా అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి శామ్యూల్ అనంద్ కుమార్ ఆదేశాల మేరకు.. గుంటూరు నగరంలో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న 22 మందికి ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించినట్లు నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. గుంటూరు నగరంలో ప్రత్యేక పర్యవేక్షక బృందాలను నియమించామని.. ఎవరైనా మాస్క్ లేకుండా వీధుల్లోకి వస్తే రూ.1000 జరిమాన విధిస్తారన్నారు.

ABOUT THE AUTHOR

...view details