గుంటూరు జిల్లా మంగళగిరి మార్కెట్ ఛైర్ పర్సన్ గా దొడ్డక శివపార్వతి బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా అన్నపరెడ్డి బ్రహ్మారెడ్డి నియమితులయ్యారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 11 మంది సభ్యులలో ఎనిమిది మంది మహిళలే ఉండటం విశేషం.
మంగళగిరి మార్కెట్ కమిటీలో మహిళలదే హవా..! - latest news of mangalagiri market yard
గుంటూరు జిల్లా మంగళగిరి మార్కెట్ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్ పర్సన్ గా శివపార్వతి, ఉపాధ్యక్షులుగా అన్నపరెడ్డి బ్రహ్మరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.11మంది సభ్యుల్లో ఎనిమిది మంది మహిళలే ఉండటం విశేషం.
guntur dst mangalagiri market yard new committee members take charges
రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని... వాటిని క్షేత్రస్థాయిలో కర్షకులకు అందించేందుకు మార్కెట్ యార్డ్ కృషి చేస్తుందని నూతన ఛైర్ పర్సన్ శివపార్వతి అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండివైద్యురాలి కేసును సీబీఐతో విచారణ జరిపించాలి: పంచుమర్తి అనురాధ