గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని గ్రామాలను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సందర్శించారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ డ్యాం నుంచి నీరు దిగువ ప్రాంతాలకు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాచవరం మండలం రేగులగడ్డ, వెల్లంపల్లి గ్రామాలను కలెక్టర్ పరిశీలించారు.
మాచవరం మండలంలో కలెక్టర్ పర్యటన - గుంటూరు జిల్లా కలెక్టర్ తాజా వార్తలు
గుంటూరు జిల్లా మాచవరం మండలంలో కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ పర్యటించారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు సాగర్ డ్యాం నుంచి నీరు దిగువ ప్రాంతాలకు వస్తుండటంతో... లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రాంతాలను వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
guntur dst collector vistis Inland areas in guntur dst