వైరస్ నివారణ, నియంత్రణకు గుంటూరు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోందని కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రజల సహకారం కీలకమని చెప్పారు. గుంటూరు జిల్లాలో మరో 2 పాజిటివ్ కేసులు వచ్చాయని.. మరో 2 అనుమానిత కేసులు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని... స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వైద్య సిబ్బందిని అడ్డుకుంటున్నారని వార్తలు వచ్చాయని... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐడీ ఆస్పత్రిలో మరో 10 బెడ్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
'కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ తప్పనిసరి' - live updates of corona virus in andhrapradesh
కరోనాపై సమరానికి అన్ని వర్గాలు సమాయత్తం కావాలని... విశ్రాంత వైద్యులు, వైద్య సిబ్బంది తమ సహకారం అందించాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ కోరారు. త్వరలో కలెక్టరేట్లో కరోనా వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కరోనాపై తీసుకున్న చర్యలు చెపుతున్న కలెక్టర్