లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి గుంటూరు అధికార యంత్రాంగం ఆశ్రయం కల్పించింది. తిండిలేక అవస్థలు పడుతున్న రోజువారి కూలీలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు గుంటూరు నగరంలో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ పాఠశాలలో వారికి వసతి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆహారం అందేలా చూస్తున్నారు.
లాక్డౌన్: నిరాశ్రయులకు అండగా అధికార యంత్రాంగం - guntur dst authorites providefood bed shelter facilites to poor people
రెక్కాడితే గాని డొక్కాడని బడుగుజీవుల కష్టాలు కరోనా లాక్డౌన్ కారణంగా రెట్టింపయ్యాయి. రోజువారి పనిచేసేందుకు ఎక్కడా హోటళ్లు, రెస్టారెంట్లు లేకపోయేసరికి వారికి.. నిలువనీడ లేకుండా పోయింది. వీరి కోసం గుంటూరు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న జిల్లా యంత్రాంగం