కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్‌సేఫ్టీ ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏఎస్.దినేష్‌కుమార్ ప్రారంభించారు. కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వైరస్ బారిన పడినవారు పాటించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా ప్రజలకు కరోనా వైరస్‌పై మరింత అవగాహన కల్పించాలని జేసీ సూచించారు. కొవిడ్ ఆసుపత్రులలో వైద్య సేవలపై నిఘా, పర్యవేక్షణాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.
ప్రచార రథాన్ని ప్రారంభించిన జిల్లా సంయుక్త కలెక్టర్ - latest news of awareness vehicle in guntur dst
గుంటూరులో కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏఎస్.దినేష్‌కుమార్ ప్రారంభించారు. వైరస్ బారిన పడినవారు పాటించాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
http://10.10.50.85//andhra-pradesh/21-July-2020/ap-gnt-17-21-carona-pai-prachara-radham-photo-ap10029_21072020223130_2107f_1595350890_1035.JPG