ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదాయ అన్వేషణలో.. గుంటూరు రైల్వే డివిజన్ వినూత్న యత్నం - ప్యాసింజర్ బోగీలను పార్సిల్ రవాణాకు

ఆదాయం అన్వేషణలో భాగంగా సరకు రవాణాకు ప్యాసింజర్ బోగీలను సైతం గుంటూరు రైల్వే డివిజన్ వినియోగిస్తోంది. ప్యాసింజర్ రైళ్ల బోగీలను పార్సిల్ రవాణాకు ఉపయోగించటం వల్ల చిరు వ్యాపారులకు లాభదాయకంగా మారింది.

goods transport in passenger wagons
పాసింజర్​ బోగీల్లో సరకు

By

Published : Dec 26, 2020, 10:07 PM IST

కరోనా కాలంలో ఖాళీగా ఉన్న ప్యాసింజర్ రైళ్ల బోగీలను అధికారులు పార్సిల్ లోడింగ్ కోసం వినియోగిస్తున్నారు. కొవిడ్​తో చాలా రైళ్లను నిలిపేసిన కారణంగా.. ఆదాయం కోల్పోయిన గుంటూరు రైల్వే డివిజన్.. ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కిసాన్ ట్రైన్స్ పేరుతో ఆహార ధాన్యాలు, వస్తువులను బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలకు పార్శిల్ వ్యాగన్ల ద్వారా ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం పార్శిల్ వ్యాగన్లకు కొనసాగింపుగా సరకు రవాణాకు ప్యాసింజర్ బోగీలను అనుసంధానం చేస్తున్నారు.

విజయవంతంగా సికింద్రాబాద్ - హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో 9.8 టన్నుల చేపలను గుంటూరు నుంచి హౌరాకు రవాణా చేశారు. నూతన సేవల ద్వారా కేవలం రైల్వే శాఖకు మాత్రమే కాకుండా.. చిన్న చిన్న వ్యాపారులకు సైతం 10 నుంచి 20 టన్నుల వరకు సరకును ఎగుమతి చేసుకునే అవకాశం లభించింది. ఇంతకు ముందు పార్శిల్ వ్యాగన్​లో సరకు పంపాలంటే కనీస పరిమితి కింద 18 నుంచి 23 టన్నుల వరకు సరకు ఎగుమతి చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిమితి తగ్గి.. వ్యాపారులకు మేలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details