గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను.. తెదేపా వారు తమ కార్యకర్తగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
నిమ్మగడ్డపై.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు - contraversial comments on nimmagadda sec
వైకాపా నేత వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ... ఎస్ఈసీ నిమ్మగడ్డపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందించిన పథకాలను గుర్తుంచుకుని తమ అభ్యర్థులను గెలిపించి గ్రామస్థాయిలో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

నిమ్మగడ్డపై.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించాలని కోరారు. అసలు పంచాయతీ ఎన్నికల్లో ఎవరు ఓటేశారో, ఎవరు వేయలేదో తెలుసుకోవచ్చన్నారు. పంచాయతీల్లో ప్రజలు అవకాశం కల్పిస్తే వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
ఇదీ చదవండి:మాజీ ఎంపీపీని హత్య చేసి దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు