పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో ఫిర్యాదులు తెలియజేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కార్పొరేట్ తరహా వసతులు సమకూర్చుతున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన ఈనెల 26లోపు పనులు పూర్తవుతాయని తెలిపారు. దిశ సహాయ కేంద్రం, స్పందన కౌంటర్లు అన్ని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
అన్ని పోలీస్ స్టేషన్లలో కార్పొరేట్ తరహా వసతులు: ఎస్పీ అమ్మిరెడ్డి - Mangalagiri Police Station latest news update
గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో కార్పొరేట్ తరహా వసతులు సమకూర్చుతున్నట్లు పేర్కొన్నారు.
![అన్ని పోలీస్ స్టేషన్లలో కార్పొరేట్ తరహా వసతులు: ఎస్పీ అమ్మిరెడ్డి SP Ammireddy inspected](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10136152-811-10136152-1609916987800.jpg)
మంగళగిరి పోలీస్ స్టేషన్లో పనులను పరిశీలించిన ఎస్పీ అమ్మిరెడ్డి