లాక్డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవటాన్ని నిరసిస్తూ గుంటూరులో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రాణి ఒకరోజు దీక్ష చేపట్టారు. నెలన్నర రోజులుగా ప్రజలు ఇళ్లలోనే ఉండి... ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తే ఇప్పుడు మద్యం దుకాణాలు తెరిచి ప్రమాదాన్ని తెచ్చిపెట్టారని ఆమె ఆరోపించారు. అమ్మఒడి రూ.15వేలు వేసి... ఇప్పుడు నాన్న జేబులో నుంచి ఆ డబ్బులు లాగేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
'అమ్మఒడి అంటూ ఇచ్చారు... నాన్న జేబులో నుంచి లాక్కుంటున్నారు' - guntur district telugu mahila president protest news in guntur
మద్యం దుకాణాలు తెరవటాన్ని నిరసిస్తూ గుంటూరులో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రాణి ఒకరోజు దీక్ష చేపట్టారు. అమ్మఒడి ద్వారా రూ.15వేలు వేసి... ఇప్పుడు నాన్న జేబులో నుంచి ఆ డబ్బులు లాగేసుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఒకరోజు దీక్ష చేపట్టిన గుంటూరు జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు
మద్యం వల్ల మహిళలపై వేధింపులు, దాడులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే మద్యం దుకాణాలు మూసివేయాలని... కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే వరకూ మద్యం దుకాణాలు తెరవొద్దని ఆమె డిమాండ్ చేశారు.