ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదల ఇళ్లను రెగ్యులరైజ్ చేయండి'

గుంటూరు సమీపంలోని సుందరయ్యకాలనీలో నివాసముంటున్న పేదల ఇళ్లను రెగ్యులరైజ్‌ చేయాలని కమిటీ కార్యదర్శి ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు. ఈ నెల 15వ తేదీలోగా ఇళ్లను రెగ్యులరైజ్‌ చేయాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని స్పష్టంచేశారు.

guntur district sundarayya nagar poor people houses regularization
సుందరయ్యనగర్ వాసుల ఆందోళన

By

Published : Aug 4, 2020, 6:03 PM IST

గుంటూరు నగరానికి సమీపంలోని సుందరయ్యకాలనీలో నివాసముంటున్న పేదల ఇళ్లను రెగ్యులరైజ్‌ చేయాలని పుచ్చలపల్లి సుందరయ్యనగర్‌ కమిటీ కార్యదర్శి ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాలనీ సమీపంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 14 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల పేదలు అక్కడ ఇళ్లు వేసుకుని నివసిస్తున్నారని.. అయినప్పటికీ వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదన్నారు.

ప్రభుత్వం ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని చెప్పిందని.. అయినా ఆ పని జరగడం లేదని అన్నారు. ఈ నెల 15వ తేదీలోగా ఇళ్లను రెగ్యులరైజ్‌ చేయాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details