ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి'

గుంటూరు జిల్లా తెనాలిలోని కొవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేకుండా విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేశామని గుంటూరు జిల్లా తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తెలిపారు. కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

corona cases in guntur
corona cases in guntur

By

Published : May 4, 2021, 12:23 PM IST

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గుంటూరు జిల్లా తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్సా కేంద్రాన్ని, ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. కరోనా రోగులకు ఆసుపత్రి ఆధ్వర్యంలో భోజనం, అల్పాహారం అందించాలని, కరోనా బాధితులందరికీ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయాలని ఆదేశించారు. రోజూ రెండు పూటలా బ్లీచింగ్‌ చల్లించి హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని, ఒకే వీధిలో ఐదు కన్నా ఎక్కువ కేసులు వస్తే మైక్రో కంటెయిన్‌మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

తెనాలిలోని కొవిడ్ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేకుండా విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి జిల్లా స్థాయి నుంచి డివిజన్ స్థాయిలో కొన్ని ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సబ్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు

ABOUT THE AUTHOR

...view details