Mangalagiri Baptism Ghat Construction Issue: మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మిస్తున్న వేళ.. మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ అంశంలో గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ.. మంగళగిరి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై స్పందించారు. ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుపై మాత్రమే కాకుండా బాప్టిజం ఘాట్ నిర్మాణంపై నగరపాలక సంస్థ కూడా స్పందించాలని ప్రశ్నల వర్షం కురిపించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు హెచ్చరించారు. ఆయన సంధించిన ప్రశ్నలకు పాస్టర్ అసోసియేషన్ ధీటుగా స్పందించిది. అంతేకాకుండా బాప్టిజం ఘాట్ నిర్మాణానికి చేపట్టిన చర్యలను వివరించింది. ఎవరికీ సంబంధం లేకుండా ఘాట్ నిర్మించుకుంటున్నామని వివరించారు.
Baptism Ghat: మంగళగిరి బాప్టిజం ఘాట్ నిర్మాణం.. అనుమతులపై ప్రశ్నించిన బీజేపీ
Baptism Ghat Construction: మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణ అంశం.. బీజేపీకి మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్‌కి మధ్య ప్రశ్నల వర్షానికి దారి తీసింది. మొదటగా స్పందించిన గుంటూరు జిల్లా బీజేపీ.. బాప్టిజం ఘాట్ నిర్మాణానికి తీసుకున్న అనుమతులు చూపించాలని ప్రశ్నించింది.
గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుల ప్రశ్నల వర్షం: మంగళగిరిలోని హిందూ దేవాలయాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించిన.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరు ఏ లౌకిక అంశానికి చెందినదని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా ఎమ్మెల్యే వాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలో నిర్మిస్తున్న బాప్టిజం ఘాట్ నిర్మాణ అనుమతులను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థకు 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఆలోపు అనుమతులను బయటపెట్టకపోతే తర్వాత జరిగే పరిణామాలకు వారు బాధ్యత వహించబోమని హెచ్చరించారు.
స్పందించిన పాస్టర్ అసోసియేషన్: బాప్టిజం ఘాట్ నిర్మాణానికి బీజేపీ నేతలు అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని మంగళగిరి పాస్టర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని, అన్ని అనుమతులు లభించిన తర్వాతే నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. ఎవరికీ సంబంధం లేకుండా, ఎలాంటి మత మార్పిడిలు జరగకుండా ఘాట్ నిర్మించుకుంటున్నామని అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ తిమోతి వివరించారు. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో హక్కులున్నాయని ఆయన అన్నారు. హిందూ ధార్మిక సంస్థలకు స్థలాలు ఇస్తుంటే.. తాము ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. మంగళగిరిలో కోట్ల రూపాయల విలువైన స్థలాలను హిందూ దేవాలయాలకు ఇస్తుంటే తాము స్వాగతించామే.. తప్ప ఎక్కడా అడ్డుకోలేదని తెలిపారు.