ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.10 లక్షల విలువైన తెలంగాణ మద్యం బాటిళ్లు సీజ్ - గుంటూరు జిల్లా నేర వార్తలు

తెలంగాణ నుంచి ఏపీకి భారీ సంఖ్యలో తరలిస్తున్న మద్యం బాటిళ్లను గుంటూరు జిల్లా పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని.. ఓ పోలీసు అధికారిగా గుర్తించారు.

Guntur district police seized bottles of liquor worth Rs 10 lakh
Guntur district police seized bottles of liquor worth Rs 10 lakh

By

Published : Jul 5, 2020, 8:32 PM IST

మీడియాతో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి

తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విలువ 10 లక్షల రూపాయలని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

గుంటూరు నల్లపాడు ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక లారీని ఆపి పరిశీలించగా అందులో మద్యం బాటిళ్లను గుర్తించారు. లారీ డ్రైవర్​, క్లీనర్​ నుంచి సేకరించిన వివరాలతో పట్టాభిపురంలోని ఓ ప్రాంతలో సోదాలు నిర్వహించారు. అక్కడ భారీగా మద్యం బాటిళ్లను గుర్తించారు. ఘటనలో తెలంగాణకి చెందిన మొత్తం 4,800 మద్యం బాటిళ్లతో పాటు లారీ, స్విఫ్ట్ డిజైర్ కారు, ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశాం. ఈ కేసులో వినుకొండ మండలం శావల్యాపురానికి చెందిన ఓ పోలీసు అధికారి ప్రమేయం ఉంది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరపరుస్తాం. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం- అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details