గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని మంచి నీటి చెరువుకు వెళ్లే దారిలో.. గత ప్రభుత్వం పేదల కేసం పీఎంఏవై పథకం కింద గృహ సముదాయాన్ని నిర్మించింది. అక్కడే.. ఇప్పుడు క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 52 ఎకరాల్లోని ఈ సముదాయంలో.. కొన్ని ఇళ్లను లబ్ధిదారులకు గతంలోనే అందించారు. ఇంకా ఖాళీగా ఉన్న భవనాల్లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అందులో 895 పడకలను.. కరోనా అనుమానితులు, వ్యాధిగ్రస్తులకు చికత్స అందించే నిమిత్తం అందుబాటులోకి తీసుకురానున్నరు. వారం క్రితమే ప్రారంభమైన పనులను.. అధికారుల ఆదేశాల నిమిత్తం సిబ్బంది వేగవంతం చేశారు.
క్వారంటైన్ కేంద్రంగా పీఎంఏవై గృహ సముదాయాలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని చెరువు రోడ్డులో.. క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పేదలకోసం చంద్రబాబు హయాంలో పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహ సముదాయాన్ని ఇందుకు సిద్ధం చేస్తున్నారు.
క్వారంటైన్ కేంద్రాలుగా పిఎంఏవై గృహసముదాయాలు