గుంటూరులో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని పూల మాల వేసి నివాళి అర్పించారు. పేదలకు మాస్కులు, శానిటైజర్లు, ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. పేదవాడి ఆకలి తీర్చడానికి అహర్నిశలు కృషి చేసిన మహానేత ఎన్టీఆర్ అని తెదేపా రాష్ట్ర కార్యదర్శి చిట్టిబాబు కొనియాడారు.
ప్రతి పేదవాడికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలబడే పార్టీ తెదేపా అని ఆ పార్టీ సాంస్కృతిక విభాగ నాయకులు శ్రీనివాసరావు చెప్పారు. పేదలకు, జర్నలిస్టులకు నిత్యావసరాలు అందించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
గుంటూరు జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి - ntr jayanti vedukalu
గుంటూరు జిల్లా వ్యాప్తంగా నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
![గుంటూరు జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి guntur ntr jayanti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11932095-411-11932095-1622204151149.jpg)
guntur ntr jayanti
తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే ఏకైక పార్టీ తెదేపా అని తెనాలి పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దుస్ అన్నారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేకు కోసి మిఠాయిలు తినిపించుకున్నారు.
ఇదీ చదవండి:'ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం'