ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హోంమంత్రిని అడ్డగించిన నల్లపాడువాసులు.. కారణం? - Home Minister Sucharita latest news

గుంటూరులోని ఓ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఉన్న హోంమంత్రి సుచరితను.. నల్లపాడులోని రాజీవ్ గృహకల్పవాసులు అడ్డగించారు. తమ సమస్యలపై మొర పెట్టుకున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై.. హోం మంత్రి ఆగ్రహించారు.

Home Minister Sucharita
హోం మంత్రి సుచరిత

By

Published : Jul 4, 2021, 8:48 PM IST

గుంటూరు స్వర్ణభారతి నగర్ లో ఏర్పాటు చేసిన మదర్సా ప్రారంభోత్సవంలో హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్తుండగా.. నల్లపాడులోని రాజీవ్ గృహకల్పకు చెందిన ప్రజలు.. ఆమెను అడ్డుకున్నారు. సమస్యలు వివరించారు.

స్థానికంగా చెత్తాచెదారం పేరుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన చెందారు. స్పందించిన హోంమంత్రి.. కాలనీలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని త్వరతిగతిన తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు.

ABOUT THE AUTHOR

...view details