లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చి వారికి గుంటూరు జిల్లా కొల్లూరు ఎస్సై ఉజ్వల్ కుమార్ వినూత్నంగా దండన చేస్తున్నారు. అలా వచ్చిన వారికి ఓ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడ... "నేను మూర్ఖుడిని... మాస్క్ పెట్టుకోను.. పనీపాటా లేకుండా రోడ్లమీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను.. నేను సమాజానికి శత్రువును" వంటి వ్యాఖ్యలు రాయించారు. అక్కడే వారితో సెల్ఫీ తీయిస్తున్నారు. అంతే కాకుండా మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారికి హారతి ఇచ్చి శానిటైజర్‌తో చేతులు కడిగించి పంపిస్తున్నారు.
'నేను మూర్ఖుడిని... సమాజానికి శత్రువును!'
గుంటూరు జిల్లా కొల్లూరు ఎస్సై ఉజ్వల్ కుమార్... లాక్డౌన్ నిబంధనలు పాటించని వారికి వినూత్నంగా దండన ఇస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న వారికి ఓ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. వాటిపై 'నేను సమాజానికి శత్రువును' వంటి వాఖ్యలు లిఖించారు. కారణాలు లేకుండా తిరిగే వారితో అక్కడ సెల్ఫీ తీయిస్తున్నారు. మాస్క్ వేసుకోని వారికి హారతి ఇచ్చి శానిటైజర్‌తో చేతులు కడిగించారు.
వినూత్నంగా దండన ఇస్తున్న కల్లూరు ఎస్సై ఉజ్వల్ కుమార్