కోవిడ్ టీకా సురక్షితమైందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి భరోసా ఇచ్చారు. జీజీహెచ్లో ఆమె టీకా తీసుకున్నారు. వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగిపోవాలన్న జేసీ పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంతితో పాటు.. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
కోవిడ్ టీకా సురక్షితం.. ఆందోళన వద్దు: జేసీ - జీజీహెచ్లో వ్యాక్సిన్ తీసుకున్న గుంటూరు జేసీ ప్రశాంతి
కోవిడ్ టీకా సురక్షితమైందని... గుంటూరు జేసీ ప్రశాంతి భరోసా ఇచ్చారు. వ్యాక్సినేషన్ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న సిబ్బందిని ఆమె కొనియాడారు.
కొవిడ్ టీకా సురక్షితమైంది