ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెమిడెసివర్​ కోసం రాజకీయ నాయకుల రికమండేషన్లు..సరికాదంటున్న వైద్యులు - తెనాలిలో రెమిడెసివర్ ఇంజెక్షన్ వార్తలు

కరోనా రోగులకు రెమిడెసివర్ ఇంజక్షన్​ ఇవ్వాలని రాజకీయ నాయకులు రికమండేషన్ చేయొద్దని గుంటూరు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త స్పష్టం చేశారు. రికమండేషన్ల వలన అవసరమైన రోగులకు ఇంజక్షన్ అందించలేమని అన్నారు.

remidisiver
రెమిడెసివర్ ఇంజెక్షన్‌ కోసం సిఫార్సు చేయకండి

By

Published : Apr 26, 2021, 1:39 PM IST

రెమిడెసివర్ ఇంజెక్షన్‌ కోసం సిఫార్సు చేయకండి

కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయిన వెంటనే రెమిడెసివర్ ఇంజక్షన్‌ కావాలని రాజకీయ నాయకులు సిఫార్సులు చేయటం వైద్యాధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. సాధారణ ప్రజలకు, వాస్తవంగా అవసరమైన వారికి అవి అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని.. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్‌ ఎమ్ సనత్‌ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని.. రెమిడెసివర్‌ సరఫరా తక్కువగా ఉన్న కారణంగా అవసరమైనవారికే అందిస్తామని స్పష్టం చేశారు. రెమిడెసివర్​ను రోగులకు ఇవ్వాలని.. రికమండేషన్లతో రావొద్దని ఆమె స్పష్టం చేశారు.

కొవిడ్ టీకాలపై అనుమానాలొద్దు

అన్ని టీకాలు సమానంగా పని చేస్తాయని.. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదని డాక్టర్ సనత్ కుమారి స్పష్టం చేశారు. నాలుగు వారాల తరువాత ఎప్పుడైనా.. రెండో డోస్ టీకా తీసుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:'ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ ఐపీఎల్ మ్యాచ్​లు చూస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details