ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎంపై అభ్యంతరకర పోస్టులు...డీసీసీబీ ఉద్యోగిని సస్పెండ్ - డీసీసీబీ ఉద్యోగి సస్పెండ్ తాజా వార్తలు

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి జగన్​పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో... గుంటూరు జిల్లా డీసీసీబీ ఉద్యోగిని సస్పెండ్ అయ్యారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు సదరు ఉద్యోగినిని సస్పెండ్ చేసినట్లు బ్యాంకు ఇంఛార్జ్ సీఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు.

Guntur district DCCB employee suspended in defamation case
సీఎంపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఉద్యోగిని సస్పెండ్

By

Published : Jun 4, 2020, 9:15 AM IST

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి జగన్​పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో గుంటూరు జిల్లా డీసీసీబీ ఉద్యోగిని సస్పెండ్ అయ్యారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం ఏడాది పాలనపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఓ మహిళపై వైకాపా నాయకులు గుంటూరులోని అరండల్​పేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఆమె గుంటూరు డీసీసీబీ ఉద్యోగిని మాధనిగా గుర్తించారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు సదరు ఉద్యోగినిని సస్పెండ్ చేసినట్లు బ్యాంకు ఇంఛార్జ్ సీఈవో సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details