గుంటూరు జిల్లాలో గురువారం 385 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు నగరంలోనే 102 మంది ఈ వ్యాధి సోకింది. దీంతో ఇప్పడు జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య 65,003కు చేరింది. ఇక మండలాల వారీగా చూస్తే.... మంగళగరి 26, నరసరావుపేట 22, చిలకలూరిపేట 18, బాపట్ల 18, తెనాలి 15, పొన్నూరు 14, రేపల్లె 14, వేమూరు 11, చేబ్రోలు 11, కర్లపాలెం 10 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 124 కేసులు వచ్చాయి. వ్యాధి బారి నుంచి ఇప్పటివరకు 59,547 మందికి కోలుకున్నారు. జిల్లాలో గురువారం నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్యం 598కి చేరింది.
జిల్లాలో 385 కరోనా కేసులు నమోదు - గుంటూరు జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది. గురువారం నలుగురు మృతి చెందగా.. మొత్తం జిల్లాలో మరణాల సంఖ్య 598కి చేరింది.
కరోనా సోకి జిల్లాలో నలుగురు మృతి