ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. లక్కీ డ్రా పేరుతో టికెట్ల అమ్మకం - ambati news

Case on Ambati: సంబరాల రాంబాబు లాటరీ చిక్కుల్లో పడ్డారు. సంక్రాంతికి వంద రూపాయలు కట్టండి.. లక్షల విలువైన బహుమతులు గెలుచుకోండి అంటూ సత్తెనపల్లి నియోజకవర్గ జనాన్ని ఊరించిన మంత్రి అంబటి.. ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. రాష్ట్రంలో లాటరీ చట్టవిరుద్ధమని జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో.. అంబటిపై కేసు నమోదుకు గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది.

case on ambati
మంత్రి అంబటి రాంబాబు కేసు నమోదు

By

Published : Jan 11, 2023, 12:51 PM IST

Updated : Jan 11, 2023, 4:25 PM IST

లాటరీ చిక్కుల్లో సంబరాల రాంబాబు

Case on Ambati: మంత్రి అంబటి రాంబాబు ఏది చేసినా.. చిరిగి చాటవడం కాదు.. చాపంతవుతుంది. కాకపోతే ఆయన ఒకటి అనుకుంటే.. జలవనరుల శాఖలో రివర్స్‌ టెండరింగ్‌లాగే మరొకటి అవుతుంది. మొన్నా మధ్య సత్తెనపల్లిలో.. ముగ్గుల పోటీ నిర్వహించిన అంబటి రాంబాబుకు ఓ మహిళ పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీ వద్దు- జనసేన ముద్దు అంటూ ముగ్గుతో రాశారు. వైసీపీ శ్రేణులు.. ఈ షాక్‌ నుంచి తేరుకోకముందే అంబటికి.. మరో చిక్కు ఎదురైంది.

సంక్రాంతికి వైసీపీ నేతలు లక్కీ డ్రా పెట్టారు. దానికి పేరు కూడా వైఎస్‌ఆర్‌ సంక్రాంతి లక్కీ డ్రా అని పెట్టారు. పార్టీ తరఫునే నిర్వహిస్తున్నట్లు.. వేలకు వేలు టోకెన్లు ముద్రించారు. అక్కడా వైసీపీ నేతలు.. ప్రోటోకాల్‌ పాటించారు. ముఖ్యమంత్రి జగన్‌, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫోటోలూ ముద్రించారు. ఈ స్థాయిలో ఏర్పాట్లు చేసిన వైసీపీ నేతలు.. ప్రచారం అంతకుమించి చేశారు. ఏకంగా మంత్రి అంబటి రాంబాబే.. ఈ లాటరీలో ఏమేమున్నాయో చెప్పి ఊరించారు.

అన్నీ పురుషుల కోసమే అయితే ఏం బాగుంటుంది.. మహిళలను ఆకర్షించేందుకూ.. ప్రణాళికలు వేశారు. డైమండ్‌ నెక్లస్‌ గెలుచుకోవచ్చాన్నారు మంత్రి అంబటి. వంద రూపాయలు పెట్టి లాటరీ టికెట్‌ కొంటే..అంతకన్నా ఎక్కువే గిట్టుబాటు అవుతుందన్నారు.

అంబటి వారి అదిరిపోయే ప్రచారం జనసేన నేతల కంటపడింది..! అసలు రాష్ట్రంలో అనుమతి లేకుండా లాటరీ ఎలా నిర్వహిస్తారంటూ అంబటిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంబటి ఆధ్వర్యంలోనే లాటరీ జరుగుతోందని.. ఫిర్యాదులో పేర్కొంది. ఐతే.. అంబటిపై కేసు నమోదుకు పోలీసులు ససేమిరా అన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలను వదిలిపెట్టరాదని నిర్ణయించిన జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు.. గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. లాటరీ టికెట్ల గురించి అంబటి చేసిన ప్రచార వీడియోను కోర్టుకు సమర్పించారు. రాష్ట్రంలో లాటరీ వ్యాపారానికి అనుమతి లేకపోయినా బహుమతుల పేరిట టికెట్లు విక్రయిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. కేసు విచారించిన న్యాయమూర్తి అంబటిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details