ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గడువులోగా ఇళ్ల పట్టాలు సిద్ధం చేయండి: కలెక్టర్ - గుంటూరు జిల్లా కలెక్టర్ లేటేస్ట్ న్యూస్

నరసరావుపేటలోని టౌన్ హాల్లో నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్లలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అనుకున్న సమయానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

గడువులోగా ఇళ్లపట్టాలు సిద్ధం చేయండి:జిల్లా కలెక్టర్

By

Published : Nov 8, 2019, 4:50 PM IST

గడువులోగా ఇళ్లపట్టాలు సిద్ధం చేయండి:జిల్లా కలెక్టర్

పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాల అమలులో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ, నరసరావుపేట, గురజాల సబ్ డివిజన్లలోని అధికారులు హాజరయ్యారు. అర్హులైన వారికి కేటాయించే గృహాలకు కావాల్సిన ప్రభుత్వ స్థలాల సేకరణపై కలెక్టర్ చర్చించారు. ప్రభుత్వ భూముల్లేని ప్రాంతాల్లో ప్రైవేట్ పట్టా భూములను సాధ్యమైన తక్కువ ధరలకు కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు. అనుకున్న సమయానికి ఇళ్ల పట్టాలు సిద్ధం చేయాలని సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details