ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్​

వరదల వల్ల పంటలకు అధిక నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. వేమూరులో దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

guntur district collector
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్​

By

Published : Dec 4, 2020, 3:31 PM IST

గుంటూరు జిల్లా వేమూరులో తుపాను​ వల్ల దెబ్బతిన్న పంట పొలాలను కలెక్టర్​ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. రైతులకు ఆయన ధైర్యం చెప్పారు. వరదల వల్ల పంటలకు ఎక్కువ నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1.33 లక్షల హెక్టార్లలో వరి నీట మునిగిందని అన్నారు.

ప్రకృతి విపత్తుల సమయంలో రైతులు ఎక్కువగా నష్టపోకుండా.. ఏం చేయాలనే దానిపై నీటిపారుదలశాఖ అధికారులతో నివేదిక తయారు చేయిస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పాలనాధికారి పరిశీలించారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని...రైతులు తొందరపడి వ్యాపారులకు అమ్ముకోవద్దని సూచించారు.

ఇదీ చదవండి: 'పాడైన పంటను ప్రభుత్వమే కొంటుంది.. వివరాలు నమోదు చేయండి'

ABOUT THE AUTHOR

...view details