గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్
'చికెన్ తింటే కరోనా రాదు' - Guntur District Collector Samuel Anand Kumar
చికెన్ తింటే కరోనా వైరస్ రాదని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్
చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని గుంటూరు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ కోరారు. చికెన్, గుడ్లు తినటం వల్ల కరోనా వస్తుందనే ఆధారాలు లేనందున పోషక విలువలున్న వీటిని ప్రజలు చక్కగా తినవచ్చని తెలిపారు. అందరూ పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.