గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పలు ప్రాతాలను సందర్శించారు. మల్లమ్మ సెంటర్ నుంచి కూరగాయల మార్కెట్ వరకూ నడుచుకుంటూ వెళ్లి ఆ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఆయా ప్రాంతాలలో పరిశుభ్రతపై అధికారులు తీసుకుంటున్న చర్యలను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్పై అధికారులకు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు.
నరసరావుపేటలో కలెక్టర్ పర్యటన - కూరగాయలు, చేపల మార్కెట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్
స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని కూరగాయలు, చేపల మార్కెట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో పరిశుభ్రతపై అధికారులు తీసుకుంటున్న చర్యలను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్