విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని అధికారులను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ ఆదేశించారు. కొవిడ్ స్ట్రెయిన్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబరు 24కు ముందు యూకే నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా హోం క్వారంటైన్ పాటించాలని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నవంబరు, డిసెంబరు నెలల్లో యూకే నుంచి 255 మంది వచ్చారు. 234 మందిని గుర్తించగా.. ఇంకా 21 మంది ఆచూకీ లభించాల్సి ఉందని అధికారులు వివరించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనాపై ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని.. 0863-2271492 నంబరుకు సంప్రదించాలని సూచించారు.