ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​..బాలాజీనాయక్​ను ఆస్పత్రిలో చేర్చుకున్న అధికారులు - గుంటూరు జిల్లాలో మూత్రపిండాల వ్యాధి బాధితుడు

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి గుంటూరు జీజీహెచ్ లో వైద్యం నిరాకరించటంపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పందించారు. వెంటనే వారిని ఆసుపత్రులో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశించారు.

Guntur District Collector responding to an article in ETV  bharat
ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై స్పందించిన గుంటూరు జిల్లా కలెక్టర్

By

Published : Aug 10, 2020, 9:07 PM IST

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి గుంటూరు జీజీహెచ్​లో వైద్యం నిరాకరించటంపై ఈటీవీ భారత్​లో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ స్పందించారు. వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని ఆదేశించారు. దీంతో జీజీహెచ్ అధికారులు... మూత్రపిండాల వ్యాధి బాధితుడు బాలాజీ నాయక్ ను గుంటూరు పిలిపించి ఆసుపత్రిలో చేర్చుకున్నారు. అతనికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్ లో కోవిడ్ రోగులు ఎక్కువగా ఉన్నందున బాలాజీ నాయక్ ను అధికారులు చేర్చుకోలేదు. దీంతో అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయం ఈటీవీ-భారత్​, ఈనాడు దృష్టికి వచ్చింది. టీవీ, పత్రికలో వచ్చిన కథనాలు రావడం వల్ల అధికారులు స్పందించి బాలాజీ నాయక్ ని ఆసుపత్రిలో చేర్చుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details