కరోనా నివారణపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులతో కలిసి గుంటూరులో సమావేశం నిర్వహించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 20 కంటైన్మెంట్ జోన్లు, వాటి పరిధిలో 59 క్లస్టర్లు ఉన్నాయని చెప్పారు. గుంటూరు నగరంలోని 26వ డివిజన్ మినహా మిగిలినవన్నీ కంటైన్మెంట్ జోన్లేనని స్పష్టం చేశారు. ఈ జోన్లలో ఎలాంటి మినహాయింపులు లేవని... బఫర్ జోన్లలో మాత్రం ఉదయం 6 నుంచి 9 గంటలకు వరకు నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లాలో రెడ్జోన్లే... ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఉండవు - Guntur District Containment Zones Latest News
గుంటూరు జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించినందున... కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు లేవని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రెడ్‌జోన్ గానే ఉంటుందని... ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఉండవని స్పష్టం చేశారు.
అధికారులతో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సమావేశం
మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించకుండా గుమికూడితే షాపుల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అంతర్రాష్ట్ర రాకపోకలకు స్పందన యాప్‌లో నమోదు తప్పనిసరని.. రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే రాకపోకలు సాధ్యమని సమావేశంలో పాల్గొన్న జేసీ దినేశ్ కుమార్ చెప్పారు.