గుంటూరు నాయుడుపేటలో ఏర్పాటవుతున్న విద్యుత్ తయారీ కేంద్రాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్ జనరేటర్ ప్లాంట్ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు ఆలస్యమవటానికి గల కారణాలను సంస్థ ప్రతినిధిలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి కల్లా కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
'జనవరి నాటికి నిర్మాణం పూర్తి చేయాలి' - guntur district latest news updates
గుంటూరులో ఏర్పాటవుతున్న జిందాల్ సంస్థ విద్యుత్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ప్లాంట్ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
గుంటూరు, విజయవాడ నగరపాలక సంస్థలతో పాటు, ఏడు పురపాలికల్లో పోగయ్యే చెత్తను ఇక్కడకు తరలించి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. జిందాల్ సంస్థ 15మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. అనంతరం జేకేసీ కళాశాల మార్గంలో రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్, కమిషనర్ పరిశీలించారు.
ఇదీచదవండి.
ఎమ్మెల్యే ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరు
TAGGED:
జిందాల్ విద్యుత్ పరిశ్రమ