గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశానికి కొందరు అధికారులు, ఉద్యోగులు ఆలస్యంగా రావడంపై గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక సమావేశానికి నిర్ణీత సమయానికంటే 20 నిమిషాలు ఉద్యోగులు ఆలస్యంగా రావడాన్ని కలెక్టర్ తప్పుబట్టారు. ఉద్యోగులు ప్రజల సేవకులన్న మాట మర్చిపోవద్దని.... విధుల్లో నిర్లక్ష్యం పనికిరాదని అన్నారు. ఆలస్యంగా వచ్చిన వారందరిని గైర్హాజరుగా నమోదు చేసి ఛార్జ్ మెమోలు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. సమావేశం అనంతరం ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులు వెళ్లి తమ ఆలస్యానికి కారణాలు వివరించే ప్రయత్నం చేయగా...ఆయన తిరస్కరించారు.
కలెక్టర్ సమావేశానికే ఉద్యోగులు ఆలస్యం...! - guntur
గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశానికి కొందరు అధికారులు ఆలస్యంగా రావటంపై...వారందరికి ఛార్జ్ మెమోలు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు.
అధికారులపై ఆగ్రహించిన కలెక్టర్