గుంటూరు జిల్లా తెనాలిలోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) చెంచుపేట బ్రాంచ్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. నకిలీ బంగారం తనఖా పెట్టి కొందరు రుణం తీసుకున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. నకిలీ బంగారం ద్వారా దాదాపుగా రూ.42 లక్షలు రుణంగా తీసుకున్నట్లు బ్యాంక్ సీఈవో కృష్ణవేణి వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు దర్యాప్తు కొనసాగుతోందని ఆమె తెలిపారు. బ్యాంకు మేనేజర్, అప్రైజర్( బంగారం తనఖా పెట్టుకునే అధికారి) కుమ్మక్కై రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆరుగురు ఖాతాదారులు ఈ రుణాలు పొందినట్లు సీఈవో స్పష్టం చేశారు. నిందితులను గుర్తించి నగదును రికవరీ చేస్తామని తెలిపారు.
GDCC Bank: నకిలీ బంగారం తాకట్టు.. రూ. 42 లక్షల మోసం
GDCC Bank Fraud: తెనాలిలోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) చెంచుపేట బ్రాంచ్లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. బ్యాంకు మేనేజర్, అప్రైజర్( బంగారం తనఖా పెట్టుకునే అధికారి) కుమ్మక్కై నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 42 లక్షల రుణాలు మంజూరు చేశారు.
నకిలీ బంగారం తాకట్టు
TAGGED:
నకిలీ బంగారం తాకట్టు