ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Solar bicycle: సోలార్ సైకిల్ ఉండగా.. ఇంధన ఖర్చు దండగా! - సోలార్ సైకిల్ రూపొందించిన బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాల

దేశంలో పెట్రో, డీజిల్​ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఈ తరుణంలో గుంటూరు జిల్లా బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాల వారు సౌరశక్తితో నడిచే సైకిల్‌ను రూపొందించారు. 4 గంటలు బ్యాటరీ ఛార్జ్‌ చేస్తే... సైకిల్‌ 20 కిలోమీటర్ల వేగంతో గంటపాటు ప్రయాణిస్తుందన్నారు.

Solar bicycle
సోలార్ సైకిల్

By

Published : Jul 13, 2021, 9:58 AM IST

ముప్పా లక్ష్మణరావు

పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సౌరశక్తితో నడిచే సైకిల్‌ను గుంటూరు జిల్లా బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ముప్పా లక్ష్మణరావుతో కలిసి అధ్యాపకులు రూపొందించారు. సైకిల్‌ పైభాగంలో 15 వాట్స్‌ సామర్థ్యం కలిగిన రెండు సౌర ప్యానెళ్లకు 14 ఏహెచ్‌ మోటార్‌, 18 వోల్టుల సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీలు అనుసంధానం చేశారు.

సౌరశక్తిని ప్యానళ్లు విద్యుత్తుగా మార్చి బ్యాటరీని ఛార్జ్‌ చేస్తాయి. బ్యాటరీ ద్వారా మోటార్‌ పనిచేసి సైకిల్‌ నడుస్తుంది. దీని తయారీకి 20 రోజులు పట్టిందని, 4 గంటలు బ్యాటరీ ఛార్జ్‌ చేస్తే సైకిల్‌ 20 కిలోమీటర్ల వేగంతో గంట ప్రయాణిస్తుందని ప్రిన్సిపల్‌ తెలిపారు. సైకిల్‌కు అనుసంధానించే పరికరాల తయారీకి రూ.15 వేలు ఖర్చవుతుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details