గుంటూరు నగరంలో కరోనా బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రెండు ప్రైవేటు కొవిడ్ ల్యాబ్‌లపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గుంటూరులోని మైల్ స్టోన్ ల్యాబ్‌కు 77వేల 520 రూపాయలు, యోనటస్ ల్యాబ్‌కు 19వేల 509 రూపాయల చొప్పున అపరాధ రుసుం విధిస్తూ జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. జీవో నంబర్ 768 ప్రకారమే ఫీజులు తీసుకోవాలని.. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తం వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.
రెండు ప్రైవేటు కొవిడ్ ల్యాబ్‌లపై అధికారుల చర్యలు - గుంటూరులో రెండు ప్రైవేటు ల్యాబ్‌లపై చర్యలు
కరోనా బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణపై రెండు ప్రైవేటు కొవిడ్ ల్యాబ్ పై గుంటూరు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు ల్యాబ్‌లకు అపరాధ రుసుం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేటు కొవిడ్ ఆస్పత్రులపై చర్యలు