ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

dig trivikram Varma: 'అక్రమాలకు పాల్పడేవారిపై.. కఠిన చర్యలు తప్పవు' - గుంటూరు డీఐజీ డా. త్రివిక్రమవర్మ తాజా వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సందర్శించారు(guntur dig trivikram Varma visit Chilakaluripet Rural Police Circle Office). ఈ సందర్భంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

guntur dig trivikram Varma
డీఐజీ త్రివిక్రమ వర్మ

By

Published : Oct 30, 2021, 4:09 PM IST

గుట్కా, గంజాయి, అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు డీఐజీ డా. త్రివిక్రమవర్మ తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ సర్కిల్ ఆఫీస్​ను సందర్శించిన(guntur dig trivikram Varma visit Chilakaluripet Rural Police Circle Office) ఆయన.. పలు రికార్డులను పరిశీలించారు. ఇప్పటికే జిల్లాలో పెద్దమొత్తంలో గుట్కా నిల్వలు స్వాధీనం చేసుకున్నామని.. పోలీస్​, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ విభాగాలు.. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని డీఐజీ పేర్కొన్నారు.

చిలకలూరిపేట రూరల్ సర్కిల్(Chilakaluripet Rural Police Circle Office) పరిధిలోని స్టేషన్లలో పెండింగ్​లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు. చిలకలూరిపేట, ఒంగోలు తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని, నరసరావుపేట డీఎస్పీ సీహెచ్ విజయ భాస్కర్ రావు, రూరల్ సీఐ సుబ్బారావు, అర్బన్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..KOTAMREDDY SRINIVASULU REDDY: రోడ్డుపై పడుకొని తెదేపా నేత నిరసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details