గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో కొత్తగా 54 కేసులు నమోదయయ్యాయి. తాజా కేసులతో జిల్లాలో మెుత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74 వేల 125కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 16 ఉన్నాయి. తాడేపల్లి - 4, బాపట్ల - 4, కారంపూడి - 4, తాడికొండలో 3 కేసుల చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వివరించారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు 72 వేల 768 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో 699 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 658 మంది మృతి చెందారు.
గుంటూరులో తగ్గుతున్న వైరస్ వ్యాప్తి - గుంటూరు కరోనా కేసులు న్యూస్
గుంటూరులో వైరస్ వ్యాప్తి నెమ్మదించింది. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 54 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో వైరస్ బాధితుల సంఖ్య 74 వేల 125కి చేరింది.
గుంటూరులో తగ్గుతున్న వైరస్ వ్యాప్తి